Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

CBSE 12th Result 2020: సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫలితాలు విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ) 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో మొత్తం 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. గ‌తేడాది 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ సారి కొంత ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ సంద‌ర్భంగా ప‌రీక్షలు పాసై వారికి కేంద్ర మాన‌వ వ‌న‌రులశాఖ మంత్రి ర‌మేశ్ పోక్రియాల్ నిశాంక్ అభినందనలు తెలిపారు.

ఇక ఎప్పటిలానే ఈ సారి తిరువనంతపురం 97.67 శాతం పాస్ పర్సంటేజ్‌తో తొలిస్థానంలో నిలువగా రెండో స్థానంలో (97.05%) బెంగళూరు నిలిచింది. మూడో స్థానంలో చెన్నై (96.17%) నిలిచింది.

అన్ని సబ్జెక్టులకు గాను 90 శాతానికి పైగా మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య 157934గా నమోదైంది. అంటే 13.24శాతం మంది 90శాతం మార్కులకు పైగా ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు అన్ని సబ్జెక్టుల్లో కలిపి 95శాతం మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 38686గా ఉండగా వారి శాతం 3.24గా రికార్డ్ అయ్యింది.

ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30, 2020 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ దేశంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పేపర్లు వాల్యువేషన్‌లో జాప్యం జరిగింది. ఇక అన్‌లాక్‌ అమల్లోకి రావడంతో పేపర్ వాల్యుయేషన్ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను ప్రక‌టించింది.

Read Also: 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *