Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసుకోండి!

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం (జులై 15) విడుదల చేసింది. విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు. జూలై 13న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒక్కరోజు వ్యవధితో జులై 15న సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

results.nic.in

cbseresults.nic.in

cbse.nic.in

విద్యార్థులు SMS రూపంలోను ఫలితాలను పొందవచ్చు. ఇందుకుగాను విద్యార్థులు ‘CBSE10 Roll Number Admit card ID’ టైప్‌ చేసి 7738299899 నెంబరుకు మెసేజ్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.

ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ ఏడాది పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫలితాలతో పోల్చితే ఇది 0.36 శాతం అధికం. ఫలితాల్లో బాలికలు అత్యధికంగా 93.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 90.14 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మొత్తం ఫలితాల్లో 41,804 (2.23 శాతం) మంది విద్యార్థులు 95 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.

ఇటీవల సీబీఎస్ఈ పరీక్షలు, ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలు పెండింగ్‌లో ఉన్నాయి.

పెండింగ్‌లో ఉన్న ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా బోర్డు పరీక్షల ఫలితాలను వెల్లడిస్తోంది సీబీఎస్ఈ.

ఈ ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నట్లయితే పెండింగ్‌లో ఉన్న పరీక్షలను విద్యార్థులు రాసే వెసులుబాటులను సీబీఎస్‌ఈ కల్పించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నారు.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *