Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

CIPET Admissions 2020: సీపెట్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

* దరఖాస్తుకు జులై 31 వరకు అవకాశం

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ (సీపెట్‌)’ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ స్కిల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ (సీఎస్‌టీఎస్-హైదరాబాద్) వివిధ కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దీనిద్వారా డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి, సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సీపెట్ జేఈఈ 2020 దరఖాస్తుకు జులై 31 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం ఆగస్టు 5న సీపెట్ జేఈఈ -2020 ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 8న ఫలితాలు వెల్లడించనున్నారు.
CIPET CBT – JEE 2020 వివరాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *