Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

ISC 2020 Results: నేడే ఐసీఎస్ఈ క్లాస్ 10, ఐఎస్‌సీ క్లాస్ 12 ఫ‌లితాలు.. వెల్లడి సమయమిదే!

ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ప‌రీక్షా ఫ‌లితాల‌ను శుక్రవారం (జులై 10) వెల్లడికానున్నాయి. జులై10న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫలితాలను విడుద‌ల చేయ‌నున్నారు. విద్యార్థులు https://cisce.org/ లేదా https://results.cisce.org/ వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ రూపంలోనూ విద్యార్థులు తమ ఫలితాలను పొందే పొందే అవకాశాన్ని CISCE (Council for the Indian School Certificate Examination) కల్పించింది. ఐసీఎస్ఈ, ఐఎస్‌సీకి అనుబంధంగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త‌మ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ ద్వారా కెరీర్స్ పోర్టల్‌‌లోకి లాగినై ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు.

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో.. మార్చి 19 నుంచి 31 వ‌ర‌కు జ‌ర‌గాల్సిన ఆయా ప‌రీక్షల‌ను ఐసీఎస్ఈ, ఐఎస్‌సీ కౌన్సిల్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అనంతరం జూన్ నెల‌లో ప‌రీక్షల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు కౌన్సిల్‌ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంలో విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఆధారంగా తుది ఫలితాలను వెల్లడిస్తామ‌ని కౌన్సిల్ పేర్కొంది. అందుకు అనుగుణంగానే ఫలితాలను వెల్లడించనున్నారు.

Read Also: 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *