Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

CLAT – 2020 పరీక్ష మరోసారి వాయిదా‌

దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాల‌యాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్-2020 నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది.

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌)ను వాయిదావేస్తున్నామ‌ని నేష‌న‌ల్ లా స్కూల్ ఆఫ్ ఇండియ‌న్ యూనివ‌ర్సిటీ బెంగ‌ళూరు వీసీ ప్రొ. సుధీర్ కృష్ణస్వామి ప్రకటించారు. ప‌రీక్ష తేదీల‌ను త్వర‌లో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24న క్లాట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో మొదట జూన్ 21కి, తర్వాత ఆగస్టు 22కి వాయిదా వేశారు.

కరోనా ప్రభావం మరింతగా పెరుగుతుండటంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. క్లాట్‌-2020 పరీక్ష కోసం దాదాపు 68 వేల మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

Read Also..

సీబీఎస్ఈలో ఉద్యోగాలు (చివ‌రితేది: 21.08.2020)

SSC Jobs: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ 5846 ఉద్యోగాలు

ఐఐఎఫ్‌పీటీలో ఉద్యోగాలు (చివ‌రితేది: 24.08.2020)

బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 17.08.2020)

RBI’లో ఉద్యోగాలు.. అర్హతలివే (చివ‌రితేది: 22.08.2020)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *