Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఏపీ ఎంసెట్ ఫలితాలు వెల్లడి.. వివరాలు ఇలా

ఏపీ ఎంసెట్ (AP EAMCET 2020 Result)‌ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం (అక్టోబరు10) ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాలకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగంలో 84.78 మొత్తం శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థులు అక్టోబరు 14 నుంచి ఎంసెట్ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

లాక్‌డౌన్ కారణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఎంసెట్ పరీక్షలను గత నెల సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ 2020 (AP EAMCET) ఇంజినీరింగ్‌కు సుమారు 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా.. 84. 38 శాతం(సుమారు 1,56,899) మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.

ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 87,652 మంది దరఖాస్తు చేసుకోగా.. 75,834 మంది పరీక్షలు రాశారు. వీటి ఫలితాలను అక్టోబరు 10న వెల్లడించనున్నారు.

మరిన్ని విద్యాసంబంద కథనాల కోసం క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *