Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

CBSE 12th Compartment Result 2020: సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్‌ ఫలితాలు విడుదల

* 59.43శాతం ఉత్తీర్ణత నమోదు

ఇటీవల జరిగిన సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌ శుక్రవారం (అక్టోబరు 9) సాయంత్రం ఫలితాలను విడుదల చేసింది.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఫలితాల్లో 59.43శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెప్టెంబర్‌ 22 నుంచి 30 వరకు జరిగిన పరీక్షలకు 1,16,125 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 1,05,847మంది హాజరయ్యారు. వీరిలో 52,211మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు.

Also Read: AP POLYCET – 2020 ఫలితాలు విడుదల

Also Read: కార్మికుల పిల్లల చదువుకు ఆర్థిక చేయూత

పరీక్షలు జరిగిన ఎనిమిది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. మామూలుగా అయితే, జులై- ఆగస్టు మాసాల మధ్య కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు జరుగుతాయి. కానీ, ఈసారి కరోనా కల్లోలం నేపథ్యంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సెప్టెంబర్‌ నెలాఖర్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని విద్యాసంబంద కథనాల కోసం క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *