Uncategorized

Today Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల కొనసాగుతూనే ఉంది. అయితే దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం (జూన్ 18) బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60 తగ్గి.. రూ.45,470 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.60 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,610 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరతోపాటు వెండి ధర కూడా దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కిలో వెండి ధర రూ.100 పతనమైంది. దీంతో వెండి ధర కిలోకు రూ.47,600 వద్ద ట్రేడ్ అవుతోంది. .

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగులు పెట్టింది. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.200 పెరిగి.. రూ.46,200కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి.. రూ.47,410కి చేరరింది. ఇక కేజీ వెండి ధర రూ.100 దిగొచ్చింది. రూ.47,600కు తగ్గింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం జోరు కొనసాగింది. అక్కడ పసిడి ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరిగి.. 1737 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.52 శాతం తగ్గుదలతో 17.68 డాలర్లకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *