Latest News Results UPSC Jobs పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

సివిల్స్ ఫలితాలు.. టాపర్‌గా ‘రైతు బిడ్డ’

దేశంలోనే అత్యున్నత‌స్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్షల ఫ‌లితాలు మంగళవారం (ఆగస్టు 4) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో హర్యానాకు చెందిన రైతు బిడ్డ ప్రదీప్ సింగ్ జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంతో.. అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రదీప్ ప్రస్తుతం ఫరీదాబాద్‌లో IRS ఆఫీసర్‌గా శిక్షణ పొందుతున్నాడు. రైతు కుటుంబానికి చెందిన ప్రదీప్ స్వగ్రామం సోనిపట్ జిల్లాలోని సోన్‌పట్‌లోని తెవ్రీ గ్రామం.. అతడి తండ్రి సుఖ్‌బీర్ సింగ్ రైతుగా పనిచేస్తున్నాడు. మాజీ సర్పంచ్‌గానూ పనిచేశాడు.

సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు ప్రదీప్‌ సింగ్‌ సాధించగా.., జతిన్‌ కిషోర్‌ 2వ ర్యాంకు, ప్రతిభా వర్మ 3వ ర్యాంక్‌ సాధించారు.

తెలంగాణ జెండా..
ఫలితాల్లో తెలంగాణ జెండా రెపరెపలాడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్‌ జాతీయస్థాయిలో 110 ర్యాంక్‌ కైవసం చేసుకున్నాడు. మకరంద్‌కు IAS వచ్చే అవకాశం ఉంది. మకరంద్ తల్లిదండ్రులిద్దరూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం మకరంద్‌ కుటుంబం సిద్దిపేటలో నివాసం ఉంటుంది.

829 మంది ఎంపిక..
సివిల్ సర్వీసులకు సంబంధించి మొత్తం 927 ఖాళీలకు 829 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. 2019 సెప్టెంబ‌ర్‌లో మెయిన్స్ ప‌రీక్షలు జ‌రుగ‌గా.. 2020 ఫిబ్రవ‌రి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వహించారు.

ఇంట‌ర్వ్యూలో నెగ్గిన మొత్తం 829 మంది అభ్యర్థుల్లో జనరల్‌-304, ఈబీసీ-78, ఓబీసీ-254, ఎస్సీ-129, ఎస్టీ-67 మంది ఉన్నారు.

ఇక మొత్తం భర్తీ చేయనున్న 927 పోస్టుల్లో.. ఐఏఎస్‌-180, ఐపీఎస్‌-150, ఐఎఫ్‌ఎస్‌-24, సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌-ఎ సర్వీసెస్-438, గ్రూప్‌-బి సర్వీసెస్‌-135 పోస్టులు ఉన్నాయి..

మోదీ అభినందనలు..
సివిల్స్ ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా మోదీ వారిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *