Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

గుడ్ న్యూస్.. హెచ్‌సీఎల్‌లో 15 వేల ఉద్యోగాలు

కరోనా సంక్షోభంలో ఉన్న ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ, దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మాత్రం… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 వేల మంది ఫ్రెషర్లు(కొత్తవారిని) నియమించుకోనున్నట్లు ప్రకటించింది.

గతేడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా 9 వేల మంది సిబ్బందిని నియమించుకోగా, ఈ ఏడాది మాత్రం దీనికి అదనంగా మరో 6 వేల మందిని తీసుకోనున్నట్లు కంపెనీ హెచ్‌ఆర్‌ హెడ్‌ అప్పారావు తెలిపారు.

ఈ నియామకాలను కేవలం వర్చువల్‌ ద్వారా ఎంపిక చేసుకోనున్నట్లు చెప్పారు. వీరికి సరాసరి వేతనంగా రూ.3.5 లక్షలుగా నిర్ణయించింది.

Read Also: 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *