Uncategorized లైఫ్ స్టైల్

‘అల్లం టీ’తో అనారోగ్యం దూరం.. ఇలా చేయండి!!

అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది. ఆయుర్వేదంలో అల్లంను సర్వరోగ నివారిణిగా భావిస్తారు. అల్లంలో ప్రతి అంశం శ్రేష్ఠమైనదే. దీనిని అనాదిగా సంప్రదాయక, పాశ్యాత్య వైద్య విధానాలలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో అల్లానిది విడదీయలేని భాగమని చెప్పవచ్చు.

పచ్చళ్లలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు.
అల్లంలో అనేక శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంలో ఉండే జింజెరాల్ మరియు షోగోల్ అనే ఘాటె దానికి అంతటి మహత్తుకు కారణమని పరిశోధకులు తెలియజేసారు. అల్లం టీలో అధిక స్థాయిలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు మరియు కొద్దీ మాత్రంలో కాల్షియం, జింక్, ఫాస్పరస్, మొదలైన ఖనిజాలు ఉన్నాయి.

అల్లం టీ ప్రత్యేకం..
అల్లంతో చేసే వాటిల్లో ముఖ్యమైనది అల్లం టీ. అల్లం టీ త్రాగితే, శరీరానికి పలు ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణ సమస్యలకు చికిత్సలో దీనిని ఉత్తమంగా భావిస్తారు. అల్లం టీ నెమ్మదించిన జీర్ణక్రియను కూడా ప్రేరేపిస్తుంది మరియు రుచి చూడటాన్ని కోల్పోయిన రుచి మొగ్గలను సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఈ వ్యాసంలో అల్లం టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నింటిని తెలియజేస్తున్నాము.


అల్లం టీ ప్రతిరోజు త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు..

యాంటీ క్యాన్సర్ లక్షణాలు..
క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధంగా అల్లంను భావిస్తారు. మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది. అంతేకాకుండా అల్లం అండాశయ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, మూత్రాశయం, కాలేయం మరియు రొమ్ము క్యాన్సర్ యొక్క వ్యాప్తినిని నిరోధిస్తుంది. ఇది అల్లం టీ యొక్క ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..
అల్లం మలబద్ధకాన్ని పోగొట్టడమే కాదు సులభ విరోచనకారి కూడా ఇది కడుపు ఉబ్బరం తగ్గించడానికి సహయపడుతుంది. అల్లంలో ఉండే జింజెరాల్ మరియు షోగోల్,జీర్ణక్రియను ప్రేరేపించి పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. అల్లం టీ తాగడము వలన అజీర్తి తగ్గుతుంది. అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. ఇది అనేక జీర్ణ సమస్యలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది..
అల్లం రక్తప్రసరణను ప్రోత్సహించడం ద్వారా,రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది, రక్త శుద్ధికి తోడ్పడుతుంది. నాళాలు మూసుకు పోవడం జరుగదు. అల్లం అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ వంటి కార్డియోవాస్కులర్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది. రక్తం రక్త నాళాలలో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది కనుక గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి.

మెరుగైన మేధోసంపత్తి..
ప్రతిరోజూ అల్లం టీ సేవిస్తే, అభిజ్ఞ సామర్ధ్యాలు మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.కనుక,ఇది,మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, అపోప్టోసిస్ మరియు వాపు తగ్గిస్తుంది. నడివయసు స్త్రీలలో మతిమరుపు తగ్గిస్తుంది.

ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా..
అల్లం ఒక యాంటీ ఇన్ఫ్లటరీ ఏజెంట్ లా పనిచేసి, వాపు వలన కలిగే కీళ్ళ మరియు కండరాల నొప్పికి నివారణకు దోహదం చేస్తుంది. ప్రతిరోజూ అల్లం టీ తాగడం వలన కలిగే కొన్ని ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలలో ఇది కూడా ఒకటి.

రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది..
అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది. మన శరీరానికి సోకే ఏరకమైన వ్యాధిని అయినా, నివారించడంలో కూడా సహాయపడుతుంది.

షుగర్ నియంత్రణ..
షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనా ఫలితాలు వెళ్ళడించాయి. ప్రతి రోజు అల్లం టీ తాగే వారిలో రక్తములోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు. ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజముగా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము. ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రక్తములో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు.

కొలెస్ట్రాల్‌తగ్గిస్తుంది..
రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన దాని ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేస్తుంది అల్లం.

నోటి దుర్వాసన దూరం..
అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

జలుబు,ఫ్లూ చికిత్సలో..
సీజన్ మారినపుడు మనకు తరచుగా జలుబు చేస్తుంది. జలుబుతో బాధపడేవారు.. అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు, జలుబు వల్ల వచ్చే దగ్గు,ఫ్లూని తగ్గిస్తుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగవచ్చు.

మానసిక ఒత్తిడి మాయం..
మానసిక ఒత్తిడిని మాయం చేసే అల్లం టీ, మానసికోల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. దానివల్ల నూతనోత్సహం వస్తుంది.

నొప్పులు, వాపుల నుండి ఉపశమనం..
అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. అల్లం ‘ టీ ‘ రోజూ తీసుకుంటే మోకాళ్ల వాపులు కూడా తగ్గిపోతాయి.

అల్లం టీ తయారీ విధానం:
కావాల్సిన పదార్థాలు: 4-6 సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తేనె తగినంత, ఒక గ్లాసుడు నీరు, నిమ్మకాయ.

తయారీ విధానం..
నీటిని ఒక గిన్నెలో పోసి వేడి చేయండి. దీనికి అల్లం కలిపి చిన్నసెగపై పది నిమిషాలు మరగనివ్వండి.
➥తరువాత దీనిని వడగట్టి, గ్లాసులో పోయండి. చల్లారాక తేనె కలపండి. ఇష్టమున్నవారు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
ఇలా కొన్ని రోజులపాటు అల్లంటీ తీసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులు, విషజ్వరాల నుంచి దూరంగా ఉండవచ్చు. కరోనా వైరస్ బాధితులకు కూడా అల్లం టీతో మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *