Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ప‌రీక్షా ఫ‌లితాల‌ు విడుదల

ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ప‌రీక్షా ఫ‌లితాల‌ు శుక్రవారం (జులై 10) విడుదలయ్యాయి. జులై10న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫలితాలను విడుద‌ల చేశారు. విద్యార్థులు వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ రూపంలోనూ విద్యార్థులు తమ ఫలితాలను పొందే పొందే అవకాశాన్ని CISCE (Council for the Indian School Certificate Examination) కల్పించింది.

ఐసీఎస్ఈ, ఐఎస్‌సీకి అనుబంధంగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త‌మ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ ద్వారా కెరీర్స్ పోర్టల్‌‌లోకి లాగినై ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు.

ఫలితాల కోసం కింది లింక్‌లపై క్లిక్ చేయండి..

https://cisce.org/

https://results.cisce.org/

ఉత్తీర్ణత ఇలా..

➥ ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 99.34%, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాల్లో 96.84% ఉత్తీర్ణులయ్యారు.

➥ ఐసీఎస్ఈ 10వ తరగతిలో మొత్తం 2,07,902 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 2,06,525 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగతా 1377 విద్యార్థులు ఫెయిలయ్యారు.

➥ ఐఎస్‌సీ 12వ తరగతి ప‌రీక్షకు మొత్తం 88,409 మంది విద్యార్థులు హాజరుకాగా.. 85,611 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. 2,798 విద్యార్థులు ఫెయిలయ్యారు.

ఇవి కూడా చదవండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *