Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

IGNOU Exam 2020: సెప్టెంబర్‌లో ‘ఇగ్నో’ టీఈఈ పరీక్షలు

ఇగ్నో టీఈఈ జూన్ 2020 ప‌రీక్ష తేదీల‌ను ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాల‌యం (ఇగ్నో) ప్రక‌టించింది.

జూన్‌తో కోర్సు గ‌డువు (ట‌ర్మ్ ఎండ్-టీఈఈ) ముగియ‌నున్నవారికి సెప్టెంబ‌ర్ మొదటి వారంలో ప‌రీక్ష నిర్వహిస్తామ‌ని వెల్ల‌డించింది. క‌రోనా నేప‌థ్యంలో జూన్‌లో జ‌ర‌గాల్సిన టీఈఈ ప‌రీక్షల‌ను వాయిదా వేసింది.

ఇగ్నోలో మాస్టర్ డిగ్రి, బ్యాచిల‌ర్ డిగ్రి, పీజీ డిప్లొమా, డిప్లొమా, స‌ర్టిఫికెట్‌ కోర్సులు చేస్తున్న ‌చివ‌రి ఏడాది లేదా చివ‌రి సెమిస్టర్ విద్యార్థుల‌కు ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని అధికారిక నోటిఫికేష‌న్‌లో వెల్లడించింది.

అదేవిధంగా టీఈఈ ఎగ్జామినేష‌న్ ద‌ర‌ఖాస్తులు, అసైన్‌మెంట్లు, ప్రాజెక్టు రిపోర్టుల‌ను స‌మ‌ర్పించ‌డానికి చివ‌రి తేదీని జూలై 31 వ‌ర‌కు పొడిగించింది.

Read Also: 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *