Latest News Uncategorized

కోవిడ్ టెర్రర్.. 24 గంటల్లో 933 మరణాలు!!

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు దేశంలో 60 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

శుక్రవారం (ఆగస్టు 7) ఒక్కరోజే 933 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. మొత్తం 42,518 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

ప్రస్తుతం దేశంలో 6,88,612 యాక్టివ్‌ కేసులు ఉండగా, 14,27,006 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ శనివారం (ఆగస్టు 8) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. శనివారం రోజు 5,98,778 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 2,33,87,171 టెస్టులు పూర్తి చేశారు.

కాగా పశ్చిమ బెంగాల్‌ కేసుల తీవ్రత అధికమవుతుండటంతో ఆగస్టు 20,21,27,28,31 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించేందుకు బెంగాల్‌ ప్రభుత్వం యోచిస్తోంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 2,74,318 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,523,841కు చేరింది. వీరిలో 12,533,535 కోలుకొగా.. 7,22,952 మంది చనిపోయారు.

మరిన్ని ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *