Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే!

నీట్, జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణపై ఉన్న ఉత్కంఠతకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్‌ పోఖ్రియాల్‌ ఎట్టకేలకు తెరదించారు. జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌(జేఈఈ) మెయిన్స్‌, అదేవిధంగా నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో.. వాయిదాపడిన పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. వీటితోపాటు జేఈఈ అడ్వాన్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

నిపుణుల బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోఖ్రియాల్ స్పష్టం చేశారు.

కొత్త తేదీలివే..
మారిన షెడ్యూలు ప్రకారం.. నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13కి వాయిదా పడగా, సెప్టెంబర్‌ 1 నుంచి 6వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సెప్టెంబర్‌ 27కి వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *