Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

JNTUH Exams: జూన్‌ 20 నుంచి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ పరీక్షలు

తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంజినీరింగ్‌ పరీక్షలను నిర్వహించేందుకు జేఎన్‌టీయూ హైదరాబాద్ సన్నద్ధమవుతోంది. జూన్‌ 20 నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు ఇంజినీరింగ్‌ పరీక్షలకు సంబంధించిన పలు కీలకమైన మార్గదర్శకాలను జేఎన్‌టీయూహెచ్‌ విడుదల చేసింది.

వర్సిటీ జారీచేసిన మార్గదర్శకాలు..

✦ సెమిస్టర్ పరీక్షల సమయం 2 గంటలుగా నిర్ణయించారు.

✦ 20 నిమిషాల్లోనే సమాధానం రాసేలా ప్రశ్నలు రూపొందించారు.

✦ ఈ విద్యా సంవత్సరం నుంచి డిటెన్షన్‌ విధానం రద్దు చేశారు.

✦ విద్యార్థులు చదువుతున్న కళాశాలలోనే పరీక్షలు నిర్వహిస్తారు.

✦ ఏదైనా కారణం చేత పరీక్షలకు హాజరుకాలేకపోయినా విద్యార్థులకు..అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసే అవకాశం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *