Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

సీబీఎస్‌ఈ ఫలితాల్లో 600కు 600 మార్కులు

సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షల్లో యూపీకి చెందిన బాలిక 100% మార్కులు సాధించింది. లక్నోకు చెందిన దివ్యాంశి జైన్‌(18) ఆర్ట్స్‌ విభాగంలోని ఆరు సబ్జెక్టుల్లోనూ 600కు 600 మార్కులు పొందింది. ఆర్ట్స్‌ విభాగంలో ఈ ఘనత సాధించడం బహుశా ఇదే తొలిసారని విద్యావేత్తలు భావిస్తున్నారు.

లక్నోలోని నవయుగ్‌ రేడియన్స్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో 12వ తరగతి చదివింది. ఆమె తండ్రి వ్యాపారి. తల్లి గృహిణి. తన కుటుంబసభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం, టీచర్ల మార్గనిర్దేశం వల్లే తాను ఈ ఘనతను సాధించినట్టు ఆమె చెప్పింది. హిస్టరీలో బీఏ సీటు కోసం ఢిల్లీ యూనివర్సిటీకి దరఖాస్తు చేసినట్టు తెలిపింది.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు జులై 13న విడుదలయ్యాయి. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బాలికల ఉత్తీర్ణత 92.15% కాగా, బాలురు 86.19% ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌జెండర్ల ఉత్తీర్ణత శాతం 66.67గా ఉన్నది. మొత్తంగా పరీక్షల్లో ఉత్తీర్ణత 88.78%గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 5.38% అధికం.

కరోనా నేపథ్యంలో బోర్డు ఈ ఏడాది మెరిట్‌ జాబితాను విడుదల చేయలేదు. అలాగే, ‘ఫెయిల్‌’ స్థానంలో ‘ఎస్సెన్షియల్‌ రిపీట్‌’ (పునరావృతం (మళ్లీ పరీక్ష రాయడం) అవసరం) అనే పదాన్ని చేర్చారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు 11.92 లక్షల మంది హాజరయ్యారు.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *