Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

NEET: ‘నీట్‌’ అర్హత మార్కులు తగ్గాయోచ్..!

పీజీ వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​ -2020 అర్హత కటాఫ్​ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన కటాఫ్​ మార్కులతో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను జులై20 నుంచి ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ర్యాంక్​ కార్డు పంపించడం సాధ్యపడదని, ఆన్​లైన్​లోనే ర్యాంకు కార్డు తీసుకోవాలని అభ్యర్థులకు ఎంసీఐ సూచించింది.

ఇప్పటికే తెలంగాణలో కన్వీనర్‌ కోటాలో పీజీ వైద్యవిద్యలో మూడు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తయింది. ఈ సమయంలో అర్హత కటాఫ్‌ మార్కులను తగ్గించడం వల్ల మరింత మంది ప్రవేశాలు పొందనున్నారు.

జనరల్‌ కేటగిరీలో అంతకు ముందు 50 పర్సంటైల్‌ ఉండగా.. దాన్ని 30 పర్సంటైల్‌కు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలో 40 నుంచి 20కి, దివ్యాంగుల కేటగిరీలో 45 నుంచి 25 పర్సంటైల్‌కు తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు.

జనరల్‌ అభ్యర్థులకు గతంలో ఉన్న 366మార్కులను 275 మార్కులకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 319 మార్కుల కటాఫ్​ ఉండగా 230, దివ్యాంగులకు 342 మార్కులు ఉన్న కటాఫ్​ను 252 మార్కులకు తగ్గిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా మూడు రోజులు గడువుతో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 15న నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *