Uncategorized లైఫ్ స్టైల్

భర్తకు షాక్.. పెళ్లైన పదేళ్లకు తెలిసింది.. తన భార్య మగాడని!!

ఆమె వయసు 30 సంవత్సరాలు. తొమ్మిదేళ్ల కిందట పెళ్లైంది. పిల్లలు పుట్టట్లేదు. చిన్నా చితకా క్లినిక్‌లకు వెళ్లి సమస్య చెప్పేది. డాక్టర్లు సలహాలు ఇచ్చేవారు. అవి అన్నీ పాటించేది. ఎన్ని చేసినా పిల్లలు మాత్రం లేరు. పైగా.. ఆమెకు పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడింది. దీంతో ఆమె భర్త వెంటనే హాస్పిటల్‌లో చేర్పించాడు.

వైద్య పరీక్షల్లో ఆమె మహిళ కాదని, పురుషుడని తేలింది. ఆమె వృషణ క్యాన్సర్ (testicular cancer)‌తో బాధపడుతోందని తెలిసింది. దీంతో ఆమె భర్త షాకయ్యాడు.

మరి, ఇన్నాళ్లు అతడు ఆమె పురుషుడని ఎలా తెలుసుకోలేకపోయాడు? అసలు ఏం జరిగింది?

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ హాస్పిటల్‌లో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అనుపమ్ దత్త, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమేన్ దాస్‌లు ‘ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్’ (Androgen Insensitivity Syndrome) వల్ల ఆమెలో పురుష లక్షణాలు కనిపించలేదని తెలిపారు.

ఆమె బాల్యం నుంచి అమ్మాయిలాగే పెరిగింది. శరీరం కూడా అమ్మాయిలాగే మారింది. మహిళల తరహాలోనే వక్షోజాలు కూడా పెరిగాయి. ఆమె మాట కూడ మహిళ గొంతులాగానే ఉండేది. మహిళల తరహాలోనే మర్మాంగాలు ఉన్నాయి. అయితే, వైద్య పరీక్షల్లో అవి పురుషుడి ఉండే మర్మాంగమేనని, అరుదైన కారణాల వల్ల బయటకు ఉండాల్సిన వృషణాలు ఆమె శరీరంలోకి చొచ్చుకుని ఉన్నాయని వైద్యులు తెలిపారు.

డాక్టర్ దత్తా మాట్లాడుతూ.. ‘‘పొత్తి కడుపులో నొప్పని చెప్పడంతో వైద్య పరీక్షలు చేశాం. ఆమె కడుపులో వృషణాలు కనిపించాయి. బయోప్సీ పరీక్షల్లో ఆమెకు వృషణ క్యాన్సర్ అని తెలిసింది. దీన్నే వైద్య పరిభాషలో సెమినోమా అని కూడా అంటారు.

మగవాళ్లకు DNAలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. మహిళలకు XX క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆమెకు… XY క్రోమోజోమ్స్ ఉన్నాయి. దాంతో… ఆమె… ఆమె కాదనీ… అతడు (మగవాడు) అనీ డాక్టర్లు తేల్చారు. అంతేకాదు… ఆమెకు మహిళలకు విడుదలైనట్లుగా అండాశయం విడుదల కాదని, అసలు గర్భాశయమే లేదని కూడా క్లారిటీగా చెప్పేశారు. దాంతో… షాకవ్వడం ఆమె, ఆమె భర్త వంతైంది.

28 ఏళ్ల ఆమె సోదరికి కూడా వైద్యులు పరీక్షలు చేయగా ‘ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్’ అని తేలింది. వీరి మేనత్తల్లో కూడా ఈ సమస్య ఉందని, వారి జీన్స్ వల్లే వీరికి కూడా అది సంక్రమించిందని వైద్యులు తెలిపారు. ఈ సిండ్రోమ్ వల్ల మర్మాంగాలు శరీరంలోకి కుచించుకుపోతాయి. వారి హార్మోన్ల ప్రభావం వల్ల శరీరం మహిళల తరహాలో వృద్ధి చెందుతుంది.

వైద్యులు ఆమెకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది అరుదైన ఆరోగ్య సమస్యని, ప్రతి 22 వేల మందిలో ఒకరికి వస్తుందని వైద్యులు తెలిపారు. ఆమెను మహిళగా చూడాలని, ఎప్పటిలాగానే కలిసి ఉండాలని ఆమె భర్తకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *