Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

NIPER JEE 2020 వాయిదా.. పరీక్ష ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా జులై 25న నిర్వహించాల్సిన నైపర్ జేఈఈ 2020 పరీక్ష వాయిదా పడింది. పరీక్షను సెప్టెంబరు 28న నిర్వహించనున్నట్లు అహ్మదాబాద్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (NIPER)’ ఒక ప్రకటనలో తెలిపింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 14న నైపర్ జేఈఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జులై 25కి వాయిదా వేశారు. అయితే పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో మరోసారి పరీక్షను వాయిదా వేయాల్సి వచ్చింది. సెప్టెంబరు 28న పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

నైపర్ జేఈఈ పరీక్ష ద్వారా అహ్మదాబాద్, గౌహతి, హజిపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలీ, SAS నగర్‌ ప్రాంతాల్లోని నైపర్ విద్యాసంస్థల్లో పీజీ వైద్య సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఆన్‌లైన్ విధానంలో రెండు గంటలపాటు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. నెగెటివ్ మార్కులు అమలు చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు.

Read Also: 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *