Latest News Uncategorized టెక్నాలజీ

Jio Glass price: జియో మరో సంచలనం ‘జియో గ్లాస్’.. ధర ఎంతంటే?.. ఫీచర్లు ఇవే!

జియో రాకతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా జియో గ్లాస్‌ని ప్రవేశపెట్టి భారత్‌లో మరో ఆవిష్కరణకు తెరతీసింది. 43వ యాన్వల్ జనరల్ మీటింగ్‌ వేదికగా జియో గ్లాస్‌ని ఆవిష్కరించిన రిలయన్స్ జియో.. ఈ గ్లాసెస్ ప్రత్యేకతలు ఏంటి ? ఎలా పని చేస్తాయి అనే వివరాలను వెల్లడించింది.


కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వర్చువల్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సింగ్స్‌ కాల్స్‌కి డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో రిలయన్స్ జియో ఈ జియో గ్లాస్‌ని ప్రవేశపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవలే స్నాప్ ప్రవేశపెట్టిన స్పెక్టాకిల్స్ 3కి పోటీగానే రిలయన్స్ జియో ఈ జియో గ్లాస్‌ని తీసుకొచ్చినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రానున్నది 5జీ నెట్ వర్క్ యుగం కావడంతో అందుకు అనుగుణంగానే రిలయన్స్ జియో ఈ నెక్ట్స్ జనరేషన్ ప్రోడక్టుని తీసుకొచ్చింది.


ఇండియాను డిజిటల్ ఇండియాగా మార్చేందుకు సంస్థ చేస్తోన్న కృషిలో భాగంగానే జియో గ్లాస్ ఆవిష్కరణ జరిగినట్టు రిలయన్స్ జియో వెల్లడించింది. 5G నెట్‌వర్క్‌తో రిలయన్స్ జియో గ్లాస్ పనితీరు మెరుగ్గా ఉంటుందని జియో తెలిపింది. అంతేకాకుండా 5G స్పెక్ట్రం వేలం పూర్తయితే.. భారత్‌లో 5జీ టెస్టింగ్ సైతం ప్రారంభిస్తామని జియో స్పష్టంచేసింది.

జియో గ్లాస్ ధర ఎంతంటే?
జియో గ్లాస్ ధర ఎంత, ఎప్పుడు వినియోగదారుల చేతికి వస్తుంది అనే విషయాలను రిలయన్స్ జియో ఇంకా వెల్లడించలేదు. అయితే, ప్రస్తుతం భారత్‌లో స్నాప్ స్పెక్టాకిల్స్ 3 ధర రూ.29,999 గా ఉంది. స్నాప్ స్పెక్టాకిల్స్ 3 కి పోటీగా వస్తోన్న ప్రోడక్ట్ కావడంతో అంతకంటే తక్కువ ధరకే జియో గ్లాసెస్ అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఫీచర్లు, ప్రత్యేకతలు..
జియో గ్లాస్ పనిచేసే తీరుపై 43వ ఏజీఎంలో ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ ఒక డెమో ద్వారా వివరించారు. జియో గ్లాసెస్ బరువు 75 గ్రాములు ఉంటుంది. హై రిజల్యూషన్ డిస్ ప్లే కలిగిన ఈ స్మార్ట్ గ్లాసెస్‌కి పర్సనలైజ్డ్ ఆడియో ఆప్షన్ కూడా ఉంది. దీంతో జియో గ్లాస్ ధరించినప్పుడు ప్రత్యేకంగా మరే ఇతర ఆడియో పరికరాలు లేకుండానే ఆడియో వినేందుకు వీలు ఉంది. అన్నిరకాల ఆడియో ఫార్మాట్స్ సపోర్ట్ చేసే విధంగా జియో గ్లాసెస్‌ను రూపొందించారు. జియో గ్లాస్‌కి 25 అప్లికేషన్లకు అనుసంధానం చేసుకోవచ్చు.

జియో గ్లాస్ ఒక పెను విప్లవం – కిరణ్ థామస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధ్యక్షుడు కిరణ్ థామస్ ఈ జియో గ్లాస్ గురించి మాట్లాడుతూ.. ఈ డిజిటల్ యుగంలో జియో గ్లాస్ ఒక పెను విప్లవం సృష్టించనుందని అన్నారు. ఇప్పటివరకు జాగ్రఫీ గురించి నేర్చుకున్న సంప్రదాయ పద్ధతి జియో గ్లాస్ రాకతో ఓ చరిత్రగా మిగిలిపోతుందని.. 3D క్లాస్‌రూమ్‌ పాఠాలకు జియో గ్లాస్ ఎంతో ఉపయోగపడుతుందని కిరణ్ థామస్ తెలిపారు.

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *