All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. అర్హతలివే (చివ‌రితేది: 05.09.2020)

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు గడువు పెంపు..
వాస్తవానికి ఈ ఉద్యోగాల దరఖాస్తు గడువు ఆగస్టు 22తో ముగిసినప్పటికీ.. సెప్టెంబరు 5 వరకు పొడిగించారు. ఇప్పటివరు దరఖాస్తు చేసుకోలేని వారికి మరో అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

పోస్టుల వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 39

➥ క‌న్సల్టెంట్‌: 06

➥ ఎక‌న‌మిస్ట్‌: 01

➥ డేటా అన‌లిస్ట్‌: 05

➥ రిస్క్ అన‌లిస్ట్‌: 03

➥ ఐఎస్ ఆడిటర్: 02

➥ స్పెషలిస్ట్ ఇన్ ఫోరెన్సిక్ ఆడిట్: 01

➥ అకౌంట్స్ స్పెష‌లిస్ట్‌: 01

➥ సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌: 09

➥ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేట‌ర్‌: 05

➥ నెట్‌వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్‌: 06

విభాగాలు: అప్లైడ్ మ్యాథ‌మెటిక్స్‌, అప్లైడ్ ఎక‌నామెట్రిక్స్‌, మైక్రో ఎకనామిక్స్ మోడలింగ్, డేటా అనలిటిక్స్, రిస్క్ అనలిస్ట్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఐఎస్ ఆడిట్, స్పెషలిస్ట్ ఇన్ ఫోరెన్సిక్ ఆడిట్, చార్టర్డ్ అకౌంటెంట్, నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్, తదిరత

అర్హత‌: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌, సీఏ/ఐసీడ‌బ్ల్యూఏ/ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత‌ ఉండాలి. తగినంత అనుభ‌వం తప్పనిసరి.

వయోపరిమితి: 01.03.2020 నాటికి అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలకు 25-35 సంవత్సరాల మధ్య, ఇతర ఉద్యోగాలకు 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి. సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.08.2020.

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 05.09.2020.

Notification

Online Application

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *