All India Jobs Bank Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఎస్‌బీఐలో 3850 ఆఫీసర్ పోస్టులు.. వీరికి ప్రత్యేకం!

ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు అయిన ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 9 సర్కిళ్ల పరిధిలో 3850 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

హైదరాబాద్‌ సర్కిల్‌లో 550 ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన సర్కిల్‌లో పోస్టుల కోసం పోటీపడవచ్చు. అయితే బ్యాంకుల్లో ఆఫీసర్‌ హోదాలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివరాలు..

* సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌

ఖాళీల సంఖ్య: 3850

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకు (రీజినల్‌ రూరల్‌ బ్యాంకు)ల్లో ఆఫీసర్‌ స్థాయిలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.08.2020 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఇతరులు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా. అయితే అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ రాతపరీక్ష నిర్వహిస్తే సాధారణంగా ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి నిర్వహించే పరీక్ష మాదిరిగానే ఉంటుంది.

జీతభత్యాలు..
➥  ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభంలో నెలకు రూ.23,700 బేసిక్ పేగా చెల్లిస్తారు. అయితే అన్ని అలవెన్సులూ కలుపుకుని రూ.40 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.

➥ వీరికి 6 నెలల ప్రొబేషన్‌ పీరియడ్ ఉంటుంది. ఈ వ్యవధిలో సంతృప్తికరంగా విధులు నిర్వర్తించినవారిని స్కేల్‌ -1 ఆఫీసర్‌గా విధుల్లోకి తీసుకుంటారు. అప్పటి దాకా వీరిని సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (సీబీఓ)గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.07.2020.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.08.2020.

Notification

Online Application

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *