Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ మేరకు శనివారం (జూన్ 20) ఒక ప్రకటనలో తెలిపారు.

తప్పనిసరిగా పదోతరగతి పరీక్షలు చేపట్టాలని అనుకున్నామని. దానికి అనుగుణంగా పరీక్ష విధానంలో మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నామని.. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచామన్నారు.

పరీక్షల నిర్వహణ కోసం అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నప్పటికీ.. రాష్ట్రంలో కరోనా ప్రభావం, విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నమని మంత్రి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా ప్రబలుతున్న ప్రస్తుత సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ నిర్ణయం మేరకు పరీక్షలను వాయిదా వేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

విద్యార్థులందరూ పాస్ అయినట్లు మంత్రి ప్రకటించారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు.

దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *