Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Stock Market Today: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

గత ట్రేడింగ్‌లో మంచి లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (జులై 22) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 : 30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70.58 పాయింట్లు నష్టపోయి 37,859.75వద్ద కొనసాగుతోంది.

Read This: Gold Price: షాకిచ్చిన వెండి.. భారీగా పెరిగిన బంగారం ధర!

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18.40 పాయింట్ల నష్టంతో 11,143.85 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.58 వద్ద కొనసాగుతోంది.

ట్రేడింగ్‌లో ఆక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐటీసీ, వేదాంత, సిప్లా.. తదితర షేర్లే లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్‌యూఎల్, జీ ఎంటర్‌టెయిన్, హీరో మోటోకార్స్, లార్సెన్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

మోస్ట్ యాక్టివ్ షేర్లుగా.. ఆక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్ కొనసాగుతున్నాయి.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *