Latest News Uncategorized

కోవిడ్ టెర్రర్.. 24 గంటల్లో 933 మరణాలు!!

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు దేశంలో 60 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (ఆగస్టు 7) ఒక్కరోజే 933 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. మొత్తం 42,518 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 6,88,612 యాక్టివ్‌ కేసులు ఉండగా, 14,27,006 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

NIPER JEE 2020 వాయిదా.. పరీక్ష ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా జులై 25న నిర్వహించాల్సిన నైపర్ జేఈఈ 2020 పరీక్ష వాయిదా పడింది. పరీక్షను సెప్టెంబరు 28న నిర్వహించనున్నట్లు అహ్మదాబాద్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (NIPER)’ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 14న నైపర్ జేఈఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జులై 25కి వాయిదా వేశారు. అయితే పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో మరోసారి పరీక్షను వాయిదా […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

గుడ్ న్యూస్.. హెచ్‌సీఎల్‌లో 15 వేల ఉద్యోగాలు

కరోనా సంక్షోభంలో ఉన్న ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ, దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మాత్రం… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 వేల మంది ఫ్రెషర్లు(కొత్తవారిని) నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతేడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా 9 వేల మంది సిబ్బందిని నియమించుకోగా, ఈ ఏడాది మాత్రం దీనికి అదనంగా మరో 6 వేల మందిని తీసుకోనున్నట్లు కంపెనీ హెచ్‌ఆర్‌ హెడ్‌ అప్పారావు […]

Uncategorized బిజినెస్ న్యూస్

కరోనా ఎఫెక్ట్.. స్టాక్‌మార్కెట్ల లాభాల జోరు!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌కు.. వ్యాక్సిన్‌ తయారీలో పురోగతి వార్తలు దేశీయ మార్కెట్ల సెంటిమెంటును పరుగులు పెట్టిస్తోంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కదులుతున్నాయి. దీంతో వరుసగా ఐదో సెషన్‌లోనూ సూచీలు లాభాల బాటపట్టాయి. మంగళవారం ఉదయం 10:15 గంటల సమయానికి సెన్సెక్స్‌ 333 పాయింట్లు లాభపడి 37752.66 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ప్రారంభంలో 133 పాయింట్లు ఎగబాకి.. ప్రస్తుతం 93 పాయింట్ల లాభంతో 11116 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

పరీక్షలు రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో విద్యార్థుల పిటిషన్!!

యూనివర్సిటీల్లో చివరి ఏడాది పరీక్షలు రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా సుమారు 30 మంది విద్యార్థులు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా తుది పరీక్షలను నిర్వహించాలని అన్ని యూనివర్సిటీలకు సూచిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల జారీ చేసిన ఉత్తర్వును వారు సవాల్ చేశారు. దేశంలో చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారని, అలాంటి విద్యార్థులను పరీక్షలు రాయాలని బలవంతం చేయడం తగదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

సీఏ పరీక్షలు రద్దు.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా జులై 29 నుంచి ఆగస్టు 16 వరకూ జరగాల్సిన సీఏ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) సుప్రీం కోర్టుకు తెలిపింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలను నవంబరులో జరిగే పరీక్షలతో కలిపి నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత పరీక్షలకు హాజరవ్వాలా వద్దా అనే ఐచ్ఛికాన్ని విద్యార్థులే ఎంచుకునేలా.. కొన్ని రోజుల క్రితం ఐసీఏఐ తీసుకొచ్చిన ‘ఆప్ట్‌ […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే!

నీట్, జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణపై ఉన్న ఉత్కంఠతకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్‌ పోఖ్రియాల్‌ ఎట్టకేలకు తెరదించారు. జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌(జేఈఈ) మెయిన్స్‌, అదేవిధంగా నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో.. వాయిదాపడిన పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. వీటితోపాటు జేఈఈ అడ్వాన్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోఖ్రియాల్ స్పష్టం చేశారు. […]

Latest News Uncategorized

PMGKRY: ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన’ ప్రారంభం.. వలస కూలీలకు ఉపాధి భరోసా!

దేశంలోని వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే ఉపాధి కల్పించే ఉద్దేశంతో ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. బిహార్‌లోని ఖగారియా జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూన్ 20న ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాలో ఈ పథకం అమలవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడమే ఈ పథకం లక్ష్యమన్న మోదీ.. ఇందుకోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వచ్చే 125 రోజుల్లో […]

Latest News Uncategorized

14 నుంచి శబరిమల తెరవడం లేదు

నెలవారీ ప్రార్థనల కోసం శబరిమల ఆలయం తెరవడం లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ప్రకటించారు. ఆలయంలో జరగాల్సిన ఉత్సవాన్ని కూడా రద్దు చేస్తామని తెలిపారు. ఐతే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆలయ తంత్రితో కేరళ దేవస్వం మంత్రి చర్చలు జరిపారు. అనంతరం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఇప్పుడే తెరవకూడదని నిర్ణయించారు. ఆలయం లోపల పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని.. భక్తులను అనుమతించమని స్పష్టం చేశారు. శబరిమలలో ఒకసారి 50 మందికి […]