Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరూ ‘పాస్’ !!

రాష్ట్రంలో ఇప్పటికే పదోతరగతి పరీక్షలను వాయిదావేసిన ప్రభుత్వం తాజాగా.. ఓపెన్‌ స్కూల్స్‌ విద్యార్థులకు కూడా తీపికబురు వినిపించింది. ఓపెన్‌ స్కూల్‌ పదోతరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేస్తూ.. ప్రభుత్వం జులై 24న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యార్థులందరికీ 35 మార్కులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో 78 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. వీరిలో పదోతరగతి నుంచి 35 వేలమంది విద్యార్థులు, ఇంటర్‌ నుంచి 43 వేల మంది విద్యార్థులు ఉన్నారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని ఓసెన్‌ స్కూల్స్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర శర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి.. విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ అందించింది.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *