Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో వాయిదాపడ్డ పదోతరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు సూచించిన షరతుల మేరకు జూన్ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం మే 22న విడుదల చేసింది.

జూన్‌ 8 నుంచి.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పది పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య నిర్వహించనున్నారు.

పరీక్షల షెడ్యూలు ఇలా..

జూన్‌ 8న: ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌

జూన్‌ 11న: ఇంగ్లీష్‌ రెండో పేపర్‌

జూన్‌ 14న: గణితము మొదటి పేపర్‌

జూన్‌ 17న: గణితము రెండో పేపర్‌

జూన్‌ 20న: సైన్స్‌(భౌతిక శాస్త్రం) మొదటి పేపర్‌

జూన్‌ 23న: సైన్స్‌(జీవశాస్త్రం) రెండో పేపర్‌

జూన్‌ 26న: సోషల్‌ స్టడీస్‌ మొదటి పేపర్‌

జూన్‌ 29న: సోషల్‌ స్టడీస్‌ రెండో పేపర్‌

జులై 2న: ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం మరియు అరబిక్‌)

జులై 5న: ఒకేషనల్‌ కోర్సు(థియరీ)

హైకోర్టు షరతులివే..

☛ పరీక్ష కేంద్రం, నిర్వహణ నిర్ణయాలపై అన్ని మాధ్యమాల్లో విస్తృతంగాప్రచారం చేయాలి.

☛ పరీక్షకు.. పరీక్షకు మధ్య రెండు రోజుల గడువు ఉండాలి.

☛ పరీక్షకు ముందు తరువాత శానిటైజేషన్‌ చేసి కేంద్రాలను శుభ్రం చేయాలి.

☛ అవసరమైనన్ని థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లు, తగినంత మంది వైద్య సిబ్బందిని
అందుబాటులో ఉంచాలి.

☛ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలి.

☛ ఇరుకైన గదుల్లో కాకుండా, పెద్ద ఆవరణలున్న కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలి.

☛ కంటెయిన్‌మెంట్‌, రెడ్‌జోన్‌లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా పరీక్ష కేంద్రాలకు తరలించే ఏర్పాట్లుండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *