Government Jobs Telangana Jobs TSPSC Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాల భ‌ర్తీకి TSPSC నోటిఫికేష‌న్లు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీలో ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వేర్వేరుగా నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది.

సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

పోస్టుల వివ‌రాలు..

మొత్తం పోస్టులు: 22

✦ ల్యాబ్‌టెక్నీషియ‌న్: 09 (జ‌న‌ర‌ల్‌-04, బీసీ-01, ఎస్సీ-02, ఎస్టీ-01, పీహెచ్‌-01).

అర్హత‌: బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిగ్రీ లేదా మెడిక‌ల్ ల్యాబొరేట‌ర్ టెక్నాల‌జీలో డిప్లొమా చేసి ఉండాలి.

✦ వెట‌ర్నరీ అసిస్టెంట్‌: 13 (జ‌న‌ర‌ల్-07, బీసీ-02, ఎస్సీ-02, ఎస్టీ-01, పీహెచ్‌సీ-01).

అర్హత‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ లేదా పౌల్ట్రీ కోర్సులో రెండేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా త‌ప్పనిస‌రిగా ఉత్తీర్ణులై ఉండాలి. ‌

వ‌యోపరిమితి: 18 – 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధ‌న‌ల ప్రకారం వ‌యోప‌రిమితిలో సడ‌లింపులు వర్తిస్తాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, నిరుద్యోగులు రూ.80 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు..

🟍 ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.07.2020

🟍 ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: 17.08.2020

Lab Technician Notification 

Veterinary Assistant Notification  

Website

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..  

ఇవికూడా చదవండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *