Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

TSRJC CET-2020 దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలోని గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. 2020-21 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఆగస్టు 20 వరకు పొడిగించారు. ప్రవేశ పరీక్ష తేదీని తర్వాత వెల్లడించనున్నారు.

గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం మార్చి నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 16న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 15తో దరఖాస్తుల గడువు ముగియాల్సి ఉన్నది.

అయితే కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో జూన్‌ 1వ తేదీవరకు తర్వాత జులై 10 వరకు దరఖాస్తు గడువును పొడించారు. తాజాగా మారోమారు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు.

అభ్యర్థులు మరిన్ని వివరాలకు టీఎస్‌ఆర్‌జేసీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా 040- 24734899, 9490967222 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *