Latest News Uncategorized బిజినెస్ న్యూస్

రూ.60 వేలకు చేరువలో బంగారం ధర.. వెండి ఇలా!

బంగారం ధరల జోరు కొనసాగుతూనే ఉంది. వరుసుగా 16వ రోజు కూడా బంగారం ధరలు సరికొత్త రికార్డులతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. బంగారం ధరలు రూ.60 వేల మార్కుకు సమీపంలోకి వచ్చాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,060 స్థాయికి చేరాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. ఆగస్టు 8న అక్కడి మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.59,140 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,210 వద్ద కొనసాగుతున్నాయి. పలు ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో.. కిలో వెండి ధర రూ.80వేల దిశగా పయనిస్తోంది. శుక్రవారం (ఆగస్టు 8) కిలో వెండి ధర రూ.77,840 రికార్డు స్థాయికి చేరింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఔన్స్‌ బంగారం 1.4 శాతం పెరిగి.. 2061 డాలర్లకు చేరగా.. వెండి ధర ఔన్స్‌కు ఏకంగా 3 శాతం పెరిగి 28.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండిధరలు కూడా మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *