Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: షాకిచ్చిన ‘బంగారం’.. ఆకాశాన్నంటిన ‘వెండి’.!

ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా తగినట్టు కనిపించినా.. ఒక్కసారిగా పెరగటంతో బంగారం ప్రియులు షాక్ అవుతున్నారు. రెండు మూడు రోజలనుండి పసిడి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగుల పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు నేను కూడా నీ వెంటే అన్నట్లు వెండి ధర కూడా భారీగా పెరిగింది.

బంగారం, వెండి ధరలు పెరగడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 పెరిగి.. రూ.48,750 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.850 పెరిగి రూ.49,950 వద్ద నిలిచింది.

వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది కిలో వెండి ధర ఏకంగా రూ.3350 పెరిగింది. దీంతో వెండి ధర ఎన్నడూ లేని స్థాయికి చేరింది. కిలో వెండి ధర రూ.58,950 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లోనూ బంగారం ధర గురువారం (జులై 23) భారీగానే పెరిగింది. అక్కడి దుకాణాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.830 పెరిగి.. రూ.52,200 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి రూ.47,850 వద్ద కొనసాగుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పరుగులు పెట్టింది. ఔన్స్‌ బంగారం 0.36 శాతం పెరిగి.. 1872 డాలర్ల వద్ద, వెండి ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరిగి 23.23 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *