Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: కొనసాగుతున్న బంగారం, వెండి ధరల జోరు.. లేటెస్ట్ ధరలు ఇలా!

పసిడి పరుగులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా.. గత ట్రేడింగ్‌లో భారీగా పెరిగిన బంగారం ధర శుక్రవారం (జులై 24) కూడా జోరును కొనసాగించింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి.. రూ.49,00కు చేరితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 పెరిగి రూ.50,200 వద్ద కొనసాగుతోంది.

బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి ధర ఏకంగా రూ.60 వేల మార్కును దాటింది. సరఫరా తగ్గడంతోపాటు పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో.. గత ట్రేడింగ్‌లో రూ.3500 పెరిగిన వెండి ధర జులై 24న కూడా రూ.3050 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.62,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పైకి కదిలాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24, 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300 మేర పెరిగాయి. దీంతో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు దిగిరావడం గమనార్హం. అక్కడి మార్కెట్లలో పసిడి ధర ఔన్స్‌కు 0.17 శాతం క్షీణించి.. 1886 డాలర్లకు దిగిరాగా.. వెండి ధర ఔన్స్‌కు 0.67 శాతం క్షీణించి.. 23.84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *