Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: బంగారం ధర భగభగ.. భారీగా పతనమైన వెండి!

పసిడి ధర పరుగులు పెరుగుతూనే ఉంది. పాత రికార్డులను చెరిపేస్తూ.. బంగారం ధరలు కొత్త రికార్డులతో ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా- చైనా ఉద్రిక్త పరిస్థితులకు తోడు.. కోవిడ్-19 ప్రతికూల పరిస్థితులు, రూపాయి విలువ బలహీన పడటంతో బంగారం ధరకు హద్దులు లేకుండా పోయాయి.

దీంతో బుధవారం (జులై 29) దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి.. రూ.51,250కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.450 పెరిగి రూ.52,450 రికార్డు స్థాయికి చేరింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లోనూ బంగారం ధర గురువారం (జులై 29) భారీగానే పెరిగింది. అక్కడి దుకాణాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.640 పెరిగి.. రూ.54,940 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెరిగి రూ.50,370 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో వెండి ధర రూ.1300 పెరిగి రూ.66,000కు చేరితే.. హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి ధర ఏకంగా రూ.2700 పతనమై రూ.62,000 వద్ద కొనసాగుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పరుగులు పెట్టింది. ఔన్స్‌ బంగారం 0.40 శాతం పెరిగి.. 1952 డాలర్ల వద్ద, వెండి ధర ఔన్స్‌కు 0.7 శాతం పెరిగి 24.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Read Also..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *