Latest News Uncategorized బిజినెస్ న్యూస్

బంగారం దూకుడు.. దిగొచ్చిన వెండి!!

బంగారం ధరల జోరు కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు మరింత పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీంతో వరుసగా 9వ రోజు కూడా పసిడి ధరలు పెరిగాయి. ఒకవైపు బంగారం దూకుడు కొనసాగుతుంటే.. ఆకాశాన్నంటిన వెండి ధరలు దిగొస్తున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి.

బంగారం ధరలు పెరగడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పైకి కదిలింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.51,800 స్థాయికి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.300 పెరగడంతో.. రూ.53,000 కొత్త రికార్డు స్థాయికి బంగారం చేరింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. శుక్రవారం (జులై 31) 10 గ్రాముల 22, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.290 మేర పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,600కి చేరి.. ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,030 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని పలు ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర ఒకేసారి రూ.3050 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.63,000 వద్ద కొనసాగుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఔన్స్‌ బంగారం 0.62 శాతం పెరిగి.. 1954 డాలర్ల వద్ద, వెండి ధర ఔన్స్‌కు 0.46 శాతం పెరిగి 23.49 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Read Also:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *