All India Jobs Government Jobs Uncategorized UPSC Jobs ప్రభుత్వ ఉద్యోగాలు

గుడ్ న్యూస్.. 559 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్..!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా నిర్వహించే ‘కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్‌ఈ)-2020’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు.

ఈ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు..

* కంబైన్డ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్‌(సీఎంఎస్‌) – 2020

ఖాళీల సంఖ్య: 559

➥ జూనియ‌ర్ స్కేల్(సెంట్రల్ హెల్త్ స‌ర్వీసెస్‌): 182
విభాగం: సెంట్రల్ హెల్త్ సర్వీస్.

➥ అసిస్టెంట్ డివిజ‌న‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 300
విభాగం: రైల్వేలు.

➥ అసిస్టెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 66
విభాగం: ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (హెల్త్ సర్వీస్).

➥ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 04
విభాగం: న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్.

➥ జూనియ‌ర్ డ్యూటీ మెడిక‌ల్ గ్రేడ్‌(2): 07
విభాగం: ఈస్ట్/నార్త్/సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ ఉండాలి.

వయోపరిమితి: 01.08.2020 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం..
రెండు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో 500 మార్కులకు రాతపరీక్ష, రెండో దశలో 100 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొదటి దశలో ఎంపికైనవారిని మాత్రమే రెండో దశకు ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం..
రాతపరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పేపర్-1కు 250 మార్కులు, పేపర్-2కు 250 మార్కులు ఉంటాయి. ఆన్‌లైన్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత విధిస్తారు.

పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, బెంగళూరు, చెన్నైతో సహా దేశవ్యాప్తంగా 41 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.07.2020.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.08.2020.

దరఖాస్తుల ఉపసంహరణకు చివరితేదీ: 25.08.2020 – 31.08.2020 వరకు.

Notification

Online Application

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *